స్టార్ హీరోతో సినిమా.. దర్శకుడి నుంచి క్లారిటీ !

‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాతో దర్శకుడు చిదంబరం తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమాని ఆయన అద్భుతంగా తెరకెక్కించాడు. ఐతే, మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ తో కలిసి చిదంబరం పనిచేయబోతున్నారన్న రూమర్స్ బాగా వినిపించాయి. ఆ మధ్య చిదంబరం తండ్రే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. దీంతో, చిదంబరం – మోహన్ లాల్ సినిమా ఖరారైనట్లేనని భావించారు.

కానీ, చిదంబరం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మోహన్‌లాల్‌తో ఏ ప్రాజెక్ట్‌పై చర్చించలేదు. మోహన్‌లాల్‌తో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా? అని విలేకరి అడిగినప్పుడు, ‘‘ఒకవేళ అవకాశం వస్తే.. ఆ సినిమా ప్రేక్షకులు ఆశించే అద్భుతమైన సన్నివేశాలతో కూడిన వినోదాత్మక చిత్రంగా ఉంటుంది. ఆయనతో నాకు ఓ కామెడీ సినిమా చేయాలని ఉంది’ అని చిదంబరం చెప్పుకొచ్చారు.

Exit mobile version