అఖిల్ సినిమాలో సూపర్ స్టార్ ?

అఖిల్ సినిమాలో సూపర్ స్టార్ ?

Published on Mar 16, 2021 7:53 PM IST

Akhil1
స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాత్రలు ఉంటే దర్శకులు వాటి కోసం సీనియర్ స్టార్లను అప్రోచ్ కావడం జరుగుతోంది. ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో మోహన్ లాల్ ఒక ప్రముఖ పాత్ర చేసి మంచి ఫీడ్ బ్యాక్ అందుకున్నారు. ఇప్పుడు అఖిల్ సినిమాలో కూడ అదే జరగనుందట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్నాడు. ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. కేవలం అఖిల్ ను దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నట్టు సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సినిమా అఖిల్ కెరీర్లో ‘రేసు గుర్రం’ లాంటి చిత్రం అవుతుందని కూడ అన్నారు.

ఈ చిత్రం ఒక స్పై థ్రిల్లర్ గా ఉండనుంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేత ఒక కీలకమైన పాత్ర చేయించాలని అనుకుంటున్నారట సురేందర్ రెడ్డి. ఈమేరకు మోహన్ లాల్ ను అప్రోచ్ కావడం కూడ జరిగిందని చెప్పుకుంటున్నారు. మరి ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఒకవేళ ఆ వార్తే గనుక నిజమై మోహన్ లాల్ నటిస్తే మాత్రం అఖిల్ సినిమా లెవల్ డబుల్ కావడం ఖాయం. ఇకపోతే అఖిల్ చేసిన కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ జూన్ 19న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు