స్టైలిష్ లుక్ లో మోక్షజ్ఞ

స్టైలిష్ లుక్ లో మోక్షజ్ఞ

Published on Feb 18, 2024 11:12 PM IST

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా బాలయ్య కుమారుడు ఫిట్‌గా మారిపోయాడు. మొన్నటి దాకా బొద్దుగా ఉన్న అతను ఇప్పుడు బరువు తగ్గి ఫిట్‌గా హీరో లుక్ లోకి మారిపోయాడు.

పైగా ప్రస్తుతం వైజాగ్‌ లో సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ లుక్ చూసి నందమూరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మోక్షజ్ఞ సినిమా త్వరలో ఉంటుంది. ఓ దశలో అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది. మధ్యలో దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు కూడా వినిపించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు