
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని ‘మనం’ సినిమాలో అతిధి పాత్ర చేసి తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఎఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్యలు నటించిన ఈ సినిమాలో అఖిల్ ఎంట్రీకి మంచి మార్కులు పడటమే కాకుండా, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం ఇదే తరహాలో నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నారు. 100వ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్న బాలకృష్ణ ఆ సినిమాని మోక్షజ్ఞ ఎంట్రీతో మరింత స్పెషల్ గా మార్చాలనుకుంటున్నాడు. మరి నందమూరి వారసుడు అఖిల్ లా అందరినీ ఆకట్టుకుంటాడా? అనేది వేచి చూడాల్సిందే..

