మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. అందుకే నెగిటివ్ టాక్ ?

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. అందుకే నెగిటివ్ టాక్ ?

Published on Sep 7, 2026 8:00 AM IST

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నారు. అధికారిక ప్రకటనతో అంచనాలు భారీగా పెరిగినా, సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది.
మోక్షజ్ఞ వంటి క్రేజీ వారసుడిని పరిచయం చేయడానికి ఇంకా బలమైన మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ డైరెక్టర్ అయితే బాగుండేదనే అభిప్రాయం కొందరిలో ఉంది.

మోక్షజ్ఞ – వశిష్ఠ కాంబినేషన్‌పై నెగిటివ్ టాక్ రావడానికి మరో ముఖ్య కారణం.. వశిష్ఠకు ఇప్పటివరకు ‘బింబిసార’ ఒక్కటే పూర్తిస్థాయి విజయం. అటు ‘విశ్వంభర’పై వచ్చిన చర్చ కూడా ఈ అనుమానాలకు కారణంగా కనిపిస్తోంది. అయితే మోక్షజ్ఞను రొటీన్ మాస్ కథతో కాకుండా కొత్త కాన్సెప్ట్‌తో లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే వశిష్ఠను ఎంచుకున్నారనే టాక్ ఉంది. అదే నిజమైతే, “వశిష్ఠ కరెక్ట్ ఛాయిస్ అనుకోవాలేమో. ఏది ఏమైనా సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చాకే ఈ సినిమా ఎలా ఉండబోతుందో స్పష్టమవుతుంది.

తాజా వార్తలు