మరింత ఆలస్యం కానున్న ‘2 పాయింట్ 0’ !

మరింత ఆలస్యం కానున్న ‘2 పాయింట్ 0’ !

Published on May 3, 2018 3:29 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘2 పాయింట్ 0’పై ప్రేక్షకుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో వేరే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. చిత్రీకరణ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనుల్లో ఉంది. ఈ పనులు మొదలై ఇప్పటికే చాలా నెలలు గడుస్తున్న ఇంకా పూర్తికాలేదు.

పైగా ఇంతకుముందు చేసిన కొంత విఎఫ్ఎక్స్ పనిని మళ్ళీ మొదటి నుండి చేస్తున్నారట. దీంతో ఈ ఆలస్యం ఇంకొంత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ పెండింగ్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ పనులన్నీ పూర్తై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందో చూడాలి. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నెగెటివ్ రోల్ చేస్తుండగా యామీ జాక్సన్ కథానాయకిగా కనిపించనుంది.

తాజా వార్తలు