‘నన్ను కూడా పిలవొచ్చు కదయ్యా’ – బన్నీ

‘నన్ను కూడా పిలవొచ్చు కదయ్యా’ – బన్నీ

Published on Jul 7, 2019 3:06 PM IST

అల్లు అర్జున్ తన దగ్గర పని చేసే స్టాఫ్‌ ను కూడా సొంత మనుషుల్లా చూసుకుంటాడు. అయితే బన్నీ తాజాగా తన స్టాఫ్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. తన లైఫ్ కంటే తన స్టాఫ్‌ సభ్యుల లైఫ్ చాల సంతోషంగా ఎంతో ప్రశాంతంగా ఉందని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్ లో తన స్టాఫ్ ఫోటో షేర్ చేస్తూ కామెంట్ పెట్టాడు. ఇంతకీ బన్నీ ఇలా కామెంట్ పెట్టడానికి కారణం.. తన స్టాఫ్ అంతా ప్రతి శనివారం రాత్రి సరదాగా పార్టీలు చేసుకుని హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారట.

బన్నీ స్టాఫ్‌లోని శరత్‌ చంద్ర నాయుడు అనే అతను మిగిలిన స్టాఫ్ తో చేసుకున్న పార్టీకి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసాడు. దాంతో ఆ ఫొటో చూసిన అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్ లో షేర్‌ చేస్తూ.. ‘సండే మార్నింగ్ నాకు కనిపించే ఫస్ట్ సీన్ ఏంటంటే.. నా స్టాఫ్‌ అంతా రాత్రి చేసుకున్న పార్టీ ఫొటోలు.. లైఫ్ లో వారు ఎంజాయ్‌ చేసే విధానం చూస్తే.. నా జీవితం కంటే.. వారి జీవితం ఎంతో ప్రశాంతంగా ఉందనిపిస్తుంది’. అని స్టాఫ్ ను ఉద్దేశిస్తూ.. ‘నన్ను కూడా పిలవచ్చు కదయ్యా’ అని సరదాగా పోస్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు