నైజాంలో ‘పెద్ది’కి తప్పని ఇక్కట్లు.. ఫలితం పూర్తిగా దీనిపైనే ఇక!

Peddi-Movie

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ సహా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి వసూళ్లు రాబడితేనే చాలా లెక్కలు తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కంటెంట్ పై చాలా నమ్మకం పెట్టుకున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల విషయంలో హైక్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఆల్రెడీ ఏపీలో హైక్స్ వచ్చేసాయి. ఇక బుకింగ్స్ ఓపెన్ కావాల్సి ఉంది. కానీ నైజాం మార్కెట్ లో మాత్రం పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉంది. మేకర్స్ ఆల్రెడీ అపీల్ చేసినప్పటికీ హై కోర్ట్ లో సానుకూల స్పందన అయితే రాలేదనే తెలుస్తుంది. సో దాదాపు నైజాంలో పెద్ది చిత్రం సాధారణ ధరలతోనే వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇదే జరిగితే ఈ సినిమాకి గట్టి పాజిటివ్ టాక్ వస్తే తప్ప జరిగిన భారీ బిజినెస్ ని రికవర్ చెయ్యడం అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు. టాక్ మాత్రమే కాకుండా సాలిడ్ లాంగ్ రన్ కూడా ఈ చిత్రానికి పడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రీమియర్స్ పరిస్థితి ఏంటి అనేది మరింత సస్పెన్స్ గా మారింది. వాటికైనా హైక్స్ ఉంటాయా లేదా? అసలు ప్రీమియర్స్ అయినా నైజాంలో ఉంటాయా లేదా అనేది కూడా చూడాలి.

Exit mobile version