మహేష్ లైనప్ పై ఇప్పుడు మరింత హైప్..!

మహేష్ లైనప్ పై ఇప్పుడు మరింత హైప్..!

Published on Nov 28, 2023 10:01 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు తన హ్యాట్రిక్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో క్రేజీ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక జస్ట్ ఈ ఒక్క సినిమా తర్వాత మహేష్ ని ఎప్పుడెప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చూడాలి అని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా ఫ్యాన్స్ కోరిక తీరే తరుణం ఆసన్నం అయ్యింది.

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తో మహేష్ తన కెరీర్ లో 29వ సినిమా చేయనుండగా ఈ సినిమా తర్వాత మహేష్ ఏ సినిమా చేస్తాడు ఎవరితో చేస్తాడు అనే దానికి ఇప్పుడు ఆల్ మోస్ట్ సమాధానం దొరికేసింది. ఇప్పుడు టాలీవుడ్ సహా బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో అయితే మహేష్ సినిమా ఫిక్స్ కాగా అటు మహేష్ ఇటు సందీప్ నెక్స్ట్ సినిమాల లెక్క ప్రకారం చూసుకున్నా వీరి కాంబినేషన్ లో సినిమా పాజిబులిటీ ఉందని చెప్పొచ్చు. మరి టైం ఈ క్రేజీ కాంబినేషన్ ని ఎలా తీసుకొస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు