
ప్రభాస్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ సినిమా కావడంతో క్రూ సభ్యులు కూడ ఎక్కువ సంఖ్యలోనే ఉండాలి. కానీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూనిట్ సంఖ్యను భారీగా తగ్గించేశారట. ఇంతకుముందులా వందల మంది సెట్లో ఉండట్లేదట. షూటింగ్ ముందు ఏర్పాట్ల కోసం ఎక్కువమంది పనిచేసినా కూడ షూటింగ్ జరిగేటప్పుడు మాత్రం అందరూ సెట్ వదిలి వెళ్లిపోయేలా చూస్తున్నారట. ప్రభాస్, ఇతర నటీనటులు కెమెరా ముందు ఉన్నప్పుడు కేవలం అత్యవసరమైన 25 మంది సభ్యులు మాత్రమే లొకేషన్లో ఉంటున్నారట.
అసలే వందల కోట్ల బడ్జెట్ సినిమా. అనుకున్న సమయానికి పూర్తికాకపోతే నిర్మాతల మీద వడ్డీల భారం భారీగా పడుతుంది. పొరపాటున సెట్లో వైరస్ విజృంభిస్తే షూటింగ్ పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఒక్కరికి వైరస్ అంటుకున్నా అందరూ పరీక్షలు చేయించుకుని క్వారంటైన్లో ఉండాలి. అసలే ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన డేట్లు దొరకడమే గగనంగా ఉంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయాలి ఆయన. అందుకే ఎలాంటి తప్పిదం జరగకుండా ఉండేందుకు ప్రభాస్ సెట్లో ఉన్నప్పుడు ఆయన చుట్టూ వీలైనంత మంది తక్కువ క్రూ ఉంటున్నారట.