
యువహీరో సుధీర్ బాబు నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఈ నెల 22న విడుదలకానుంది. నిఖిల్ నటించిన స్వామిరారా సినిమాకు సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లు, ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నందిని హీరోయిన్. మంచు మనోజ్ అతిధి పాత్రలో మెరవనున్నాడు.
సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి 127నిముషాలకు ఖరారయినట్టు తెలుస్తుంది. తక్కువ నిడివి కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ఈ సినిమా యు/ఏ సర్టిఫికేట్ ని సంపాదించుకుంది. ఏ.ఎన్ బోస్ దర్శకుడు. చక్రి నిర్మాత. ఈ సినిమా విజయంపై సుధీర్ బాబు పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.