
తనదైన ఎంటర్టైనింగ్ సినిమాలతో వరుస విజయ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అనీల్ రావిపూడి. గత ఏడాది సంక్రాంత్రి కానుకగా విడుదల చేసిన నవ్వుల నజరానా “ఎఫ్ 2″కు ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మరధం పట్టి భారీ హిట్ చేశారు. దీనితో ఆ ఏడాది భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో అది కూడా ఒకటిగా నిలిచింది.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కోబ్రా స్ గా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రంకు సీక్వెల్ “ఎఫ్ 3″ను మేకర్స్ లేటెస్ట్ గానే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం మామూలు పూజా కార్యక్రమం ఈరోజే మొదలయింది. ఇక ఈ పూజా కార్యక్రమంలో..
నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు అలాగే వరుణ్ తేజ్, తమన్నా ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఇక అలాగే ఈ మోస్ట్ ఎంటర్టైనింగ్ చిత్రం వచ్చే డిసెంబర్ 23 నుంచి రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసుకోనుంది. మరి ఈ చిత్రం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుందో చూడాలి.