“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” నుండి అలరిస్తున్న మోత సాంగ్!

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” నుండి అలరిస్తున్న మోత సాంగ్!

Published on Mar 25, 2024 4:49 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మే 17, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ తాజాగా మోత సాంగ్ ను రిలీజ్ చేశారు.

విశ్వక్ సేన్ కెరీర్ లోనే మాస్ సాంగ్ గా వస్తున్న మోత పాట విశేషం గా ఆకట్టుకుంటుంది. ఎంఎం మానసి పాడిన ఈ పాటకి ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. నేహ శెట్టి లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో అంజలి కీలక పాత్రలో నటిస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు