బాలు, అప్సర హీరో, హీరోయిన్లుగా సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భానుమతి రెడ్డి’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ ప్రేమకథా చిత్రాన్ని డైమండ్ హౌస్ బ్యానర్‌పై రామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ భరత్ ఈ సినిమా ద్వారా నటీనటులు, టెక్నీషియన్స్‌కు మంచి పేరు రావాలని, సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని అన్నారు.
దర్శకుడు సత్య మాట్లాడుతూ ‘భానుమతి రెడ్డి’ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న లవ్‌స్టోరి అని, ఎంపీ మార్గాని భరత్ మా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. సినిమా విషయానికి వస్తే…ప్రేమకథలో ఉండాల్సిన సెన్సిబుల్ అంశాలతో పాటు రా ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను మెప్పించేలా మా సినిమాను రూపొందిస్తున్నామని అన్నారు. సినిమా విషయంలో నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డిగారు పూర్తి స్వేచ్ఛనిచ్చారని అన్నారు.
నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మార్గాని భరత్ గారు మా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి మా టీమ్‌కు ఆయన మరింత బూస్టప్ ఇచ్చారని, అందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. దర్శకుడు సత్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ‘భానుమతి రెడ్డి’ను తెరకెక్కిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ను తెలియచేస్తామని అన్నారు.
