‘మిస్టర్.kk’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

‘మిస్టర్.kk’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Jul 7, 2019 8:00 PM IST

స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కదరం కొండన్’, తెలుగులో ‘మిస్టర్ kk’గా రాబోతుంది. కాగా తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. జూలై 19వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా మొత్తానికి ఈ నెల విడుదలవుతుంది.

కాగా కమలహాసన్‌ హీరోగా తూంగావనం చిత్రాన్ని తెరకెక్కించిన రాజేశ్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో ఈ సినిమా తెరెకెక్కింది. ఈ సినిమాలో విక్రమ్‌ తన శైలి యాక్టింగ్ తో ఓ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్నాడు. పైగా విక్రమ్ గెటప్‌ కూడా కొత్తగా ఉంటుందట. కమలహాసన్‌ రెండో కూతురు అక్షరహాసన్‌ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే జూలై 19న కొబ్బరి మట్టా, ఆమె చిత్రాలు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలను దాటుకొని విక్రమ్ కి ఈ సినిమా ఏ స్థాయి హిట్ ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు