అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డెకాయిట్’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది. తాజాగా ఈ సినిమా గురించి హీరోయిన్ మృణాల్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఆమె డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్లు తెలుపుతూ స్టూడియో నుండి ఒక ఫోటోను షేర్ చేసింది.
దర్శకుడు షనీల్ డియో ఈ చిత్రాన్ని ఒక రొమాంటిక్ రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్గా వెండితెరపై ఆవిష్కరిస్తున్నాడు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలతో ఈ కథ సాగనుంది. ఇందులో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరియు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండటం విశేషం. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ పనుల వేగాన్ని పెంచింది. అడివి శేష్, మృణాల్ కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో సినీ ప్రియుల్లో ఈ ప్రాజెక్ట్ పై మంచి ఆసక్తి నెలకొంది.
