ఎమ్మెస్ ఆత్మకథ పుస్తకం విడుదల తేది.

ఎమ్మెస్ ఆత్మకథ పుస్తకం విడుదల తేది.

Published on Feb 4, 2015 3:40 PM IST

MS-Narayana1
ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ, ఈ లోకం విడిచి వెళ్ళినా.. ఆయన పంచిన నవ్వులు ప్రేక్షకులను ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాయి. నేడు, బుధవారం ఎమ్మెస్ పెద్దకర్మ జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, ఆప్త మిత్రులు, బంధువులు హాజరయ్యారు. ఎమ్మెస్ మృతి చిత్ర పరిశ్రమతో పాటు వ్యక్తిగతంగా తమకు తీరని లోటని వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ నారాయణ ఆత్మకథ త్వరలో పుస్తక రూపంలో వస్తున్నట్టు, ఆయన కుమారుడు విక్రమ్ తెలిపారు.

ఎమ్మెస్ ఆత్మకథకు ‘ఎమ్మెస్ నారాయణ – విజయం కోసం పోరాటం’ అని నామకరణం చేశారు. ఏప్రిల్ 16న ఎమ్మెస్ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. ఎమ్మెస్ జీవిత, సినీ ప్రస్థానమంతా కల ఈ పుస్తకాన్ని, ఆయన మిత్రుడు కూనపరాజు కుమార్ రాశారు.

తాజా వార్తలు