గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఎంఎస్ నారాయణ

గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఎంఎస్ నారాయణ

Published on Jul 28, 2014 1:21 PM IST

ms-Narayana

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తాగుబోతు పాత్రలు చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ఎంఎస్ నారాయణ. తాగుబోతు పాత్ర అనగానే మనకు గుర్తొచ్చేది ఎంఎస్ నారాయణ అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఆయన చేసిన సినిమాల్లో 70% తాగుబోతు పాత్రలే ఉంటాయి.

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తున్న ఎంఎస్ నారాయణ ఓ అరుదైన ఘనతని సాధించాడు. 17 సంవత్సరాల కెరీర్లో 700కి పైగా సినిమాల్లో నటించిన కారణంగా ఎంఎస్ నారాయణ పేరు గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. గతంలో కామెడీ కింగ్ బ్రహ్మానందం 20 ఏళ్ళ కెరీర్లో 700కి పైగా సినిమాల్లో నటించారని గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. తాజాగా ఆయన రికార్డ్ ను ఎంఎస్ నారాయణ బ్రేక్ చేసాడు.

టాలీవుడ్ టాప్ కమెడియన్స్ అయిన ఇద్దరు కమెడియన్స్ పేర్లు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఉండడం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవాలి. గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న సందర్భంగా కమెడియన్ ఎంఎస్ నారాయణకి 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు