గత ఏడాది అక్టోబర్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ చిత్రం ’96’ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా తెలుగు రీమేక్ కోసం శర్వానంద్, సమంతలు జోడీ కట్టారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు. కాగా తాజాగా చిత్రబృందం ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా టైటిల్ ను అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు.
