మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ ఏడాది చిత్రం పెద్ది తో టాలీవుడ్ కి ఒక సరికొత్త ఊపు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస టాలీవుడ్ సినిమాలు మరింత విజయం సాధించాయి. అయితే ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించగా చరణ్ నెక్స్ట్ సినిమాని గురువు సుకుమార్ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.
ఇక దీనిపై భారీ అంచనాలు నెలకొనగా ఈ ప్రాజెక్ట్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలు కానుంది అనే సస్పెన్స్ కి ఇప్పుడు తెర పడింది. మేకర్స్ ఈ దసరా సందర్భంగా ముహూర్త కార్యక్రమాలతో లాంచ్ చేస్తున్నట్టు ఖరారు చేసారు.
సో అందుకు ఇక ఎంతో సమయం లేదని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని సుకుమార్ గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. అలాగే ఈ నవంబర్ నుంచే సినిమా షూట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.


