‘ముకుంద’ ఆడియోకి ఆల్రెడీ హిట్ టాక్..

‘ముకుంద’ ఆడియోకి ఆల్రెడీ హిట్ టాక్..

Published on Dec 3, 2014 3:02 AM IST

Mukunda
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ముకుంద’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కి జె మేయర్ స్వరపరిచిన ఈ సినిమాలో పాటలు బుధవారం ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల, మిక్కి జె మేయర్ కాంబినేషన్లో వస్తున్న ఈ ఆడియో అప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్క రోజు ముందు యుట్యూబ్ లో ప్రోమో సాంగ్స్ విడుదల చేశారు. వీటికి మంచి స్పందన లభించింది.

సిరివెన్నెల అర్ధవంతమైన సాహిత్యం, మిక్కి జె మేయర్ కీ బోర్డు నుండి జాలువారిన మెలోడీ స్వరాలు శ్రోతలను మొదటిసారి వినగానే ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ అడ్డాల మరోసారి తన అభిరుచిని చాటుకున్నాడు. వినసొంపైన స్వరాలు, సుస్పష్టంగా అర్ధమయ్యే సాహిత్యం ‘ముకుంద’ ఆడియో ప్రత్యేకత. మెగా అభిమానులు ఈ ఆడియో కోసం వెయిటింగ్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ తొలి సినిమాగా ‘ముకుంద’ సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఈ ఆడియోతో అ క్రేజ్ రెట్టింపయింది. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ‘ముకుంద’ను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు