మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మరో హీరో, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద’ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ సినిమాకి సంబదించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశలోఉన్నాయి. ఈ సినిమాని 2015 సంక్రాంతి బరిలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారా అంటే, ఈ చిత్ర టీంకి సన్నిహితులు అవుననే అంటున్నారు.
ముందుగా ఈ సినిమాని ఈ చిత్ర టీం డిసెంబర్ 25న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. కానీ ఆ టైంలో మరికొన్ని పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతుండడంతో ‘ముకుంద’ సినిమాని సంక్రాంతి కానుకగా రిలాజ్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు. హాలిడేస్ సీజన్ కాబట్టి సంక్రాంతి సీజన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే ముకుంద పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వలన సంక్రాంతి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఈ చిత్ర టీం ఆలోచిస్తున్నారు. ఆడియోని కూడా డిసెంబర్ మొదట్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆడియో మరియు మూవీ రిలీజ్ పైన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీలోవరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.


