మంచు లక్ష్మి ‘దొంగాట’లో మల్టీస్టారర్ సాంగ్.

Lakshmi-Manchu--New-Photos-
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘దొంగాట’. ఈ సినిమాలో ఓ పాటలో తెలుగు స్టార్ హీరోలలో కొందరు స్టెప్పులు వేయనున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట’ సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం.

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు.మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version