నాని సినిమాపై ప్రైమ్ వీడియోకు షాకిచ్చిన ముంబై హెచ్ సి.!

Published on Mar 4, 2021 9:00 am IST

నాచురల్ స్టార్ నాని యాంటీ హీరోగా తన బెంచ్ మార్క్ 25వ ప్రాజెక్ట్ గా చేసిన చిత్రం “వి”. సుధీర్ బాబు మరో హీరోగా టాలెంటెడ్ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది డైరెక్ట్ గా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ హైప్ తో విడుదల కాబడిన సంగతి తెలిసిందే.

ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ నాని నటన పరంగా మాత్రం సూపర్బ్ టాక్ ను తెచ్చుకొని భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి అమెజాన్ ప్రైమ్ వారికి ఊహించని షాక్ తలిగిలినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సాక్షి మాలిక్ ఫోటోను తనని సంప్రదించకుండా ఒక ఫీమేల్ ఎస్కార్ట్ గా చూపించిన విషయంలో ముంబై హై కోర్ట్ ఈ సినిమాను తొలగించాలి అన్నట్టుగా సంచలన తీర్పు ఇచ్చింది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై మేకర్స్ కానీ ప్రైమ్ వీడియో నుంచి కానీ ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :