మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు – ఈ బాలీవుడ్ నటుడిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు!

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు – ఈ బాలీవుడ్ నటుడిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు!

Published on Apr 28, 2024 8:27 PM IST

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను ముంబై సైబర్ సెల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అరెస్టు చేసింది. సాహిల్‌ను తాత్కాలికంగా విడుదల చేయాలన్న అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో ఛత్తీస్ఘడ్ లో ఈ ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కోర్టు నిర్ణయం తరువాత, అతను ముంబై నుండి పారిపోయాడు, అయితే ఛత్తీస్ఘడ్ పోలీసుల సహాయంతో 40 గంటల ఆపరేషన్ తర్వాత అతను పట్టుబడ్డాడు.

స్టైల్ నటుడిని త్వరలో కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఇటీవల, స్టార్ నటి తమన్నా భాటియా కూడా మహదేవ్ బెట్టింగ్ యాప్ యొక్క సోదరి ప్లాట్‌ఫారమ్ అయిన ఫెయిర్‌ప్లే యాప్‌లో చట్టవిరుద్ధమైన IPL స్ట్రీమింగ్‌ను ప్రచారం చేసినందుకు ముంబై సైబర్ సెల్ ద్వారా సమన్లు అందుకుంది. రేపు ఆమెను కోర్టులో హాజరు పరచనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు