ఎన్నికల్లో విజయం సాధించిన మురళి మోహన్ మరియు బాబు మోహన్

Murali-and-Babu-Mohan
ప్రముఖ నటులు మురళి మోహన్ మరియు బాబు మోహన్ వారు పోటీ చేసిన స్థానాల్లో ఘన విజయం సాధించారు. మురళి మోహన్ రాజమండ్రి లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోగా బాబు మోహన్ మెదక్ జిల్లా లోని ఆందోల్ నియోజకవర్గం లో విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీ తరుపున బరి లో నిలిచిన మురళి మోహన్ 120000 వోట్ల ఆధిక్యం తో గెలుపు సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఈయనకి ఈ గెలుపు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇక తెలుగుదేశం పార్టీ కి వీడ్కోలు చెప్పి టి. ఆర్.యెస్ లో చేరిన బాబు మోహన్ విషయానికి వస్తే ఆయన ఆందోల్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

తమ జీవితం లో కొత్త అంకం మొదలు పెట్టనున్న ఈ ఇద్దరు నటులకి హార్దిక శుభాకాంక్షలు.

Exit mobile version