యంగ్ హీరోతో క్రేజీ కాన్సెప్ట్ ప్లాన్ చేసిన మురుగదాస్!

యంగ్ హీరోతో క్రేజీ కాన్సెప్ట్ ప్లాన్ చేసిన మురుగదాస్!

Published on Feb 16, 2024 11:58 AM IST

కోలీవుడ్ స్టార్ అండ్ వినూత్న దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ నటించనుంది. మరి ఈ చిత్రం విషయంలో మురుగదాస్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో అందించాడు.

తాను ఈ సినిమా కోసం మాట్లాడుతూ ఈ చిత్రం కోసం శివ కార్తికేయన్ ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ ని ప్రిపేర్ అవుతున్నాడు అని అలాగే ఈ చిత్రం కూడా ఒక యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాలా ఉంటుంది అని అంతే కాకుండా గజినీ తరహాలో ఒక ఆసక్తికర కొత్త నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది అని మురుగదాస్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఇన్నేళ్ల గ్యాప్ తీసుకున్నా కూడా మురుగదాస్ మళ్ళీ తన మార్క్ క్రేజీ కాన్సెప్ట్ తో రాబోతున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు