మురుగదాస్ మరోసారి ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నారా ?

మురుగదాస్ మరోసారి ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నారా ?

Published on Dec 23, 2019 10:59 PM IST

Muragdoss Vijay

తమిళ పరిశ్రమలోని స్టార్ దర్శకుల్లో మురుగదాస్ కూడా ఒకరు. దాదాపు అందరి స్టార్ హీరోలతో వర్క్ చేసిన ఆయన ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీతో ‘దర్బార్’ చేస్తున్నారు. మురుగదాస్ పనిచేసిన హీరోలో విజయ్ కాంబినేషన్లో ఆయన చేసిన మూడు సినిమాలు ‘తుపాకి, కత్తి, సర్కార్’లు భారీ విజయాలుగా నిలిచాయి. అందుకే వీరిది క్రేజీ కలయికగా పేరు తెచ్చుకుంది.

ఈ కలయిక మరోసారి రిపీట్ కానుందని అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ సినిమాల నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఈ ప్రాసెస్లోనే మురుగదాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్న వారు అందులో విజయ్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. మరి వారి ప్రయత్నం ఫలించి విజయ్, మురుగదాస్ నాలుగోసారి కలిసి పనిచేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు