
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన చక్రి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. చక్రికి సడన్ గా గుండెపోటు రావడంతో అపోలో హాస్పిటల్ లో చేర్చారు. ఆయన అక్కడే చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం అపోలో ఐసియూలో చనిపోయారు. దీనితో వారి కుటుబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
చక్రి అసలు పేరు చక్రధర్ గిల్ల.. చక్రి 1974 జూన్ 15న వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ లో జన్మించాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బాచి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా చిత్ర సీమకి పరిచయమైన చక్రి ఇప్పటి వరకూ 85 సినిమాలకు సంగీతం అందించాడు. చక్రి తన కెరీర్లో ‘ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం’, ‘అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’, ‘సత్యం’, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘ఇడియట్’, ‘దేవదాసు’, ‘సింహా’ మొదలైన సూపర్ హిట్ సినిమాలకు చక్రి మ్యూజిక్ అందించాడు. చక్రి చివరగా మ్యూజిక్ అందించిన సినిమా ‘ఎర్రబస్సు’.
చక్రి హఠాన్మరణంతో శోఖ సముద్రంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపం తెలియజేస్తున్నాం..