వెంకీ మామ కోసం సంగీత దర్శకుడు మారాడా ?

వెంకీ మామ కోసం సంగీత దర్శకుడు మారాడా ?

Published on Jul 31, 2018 12:51 AM IST

venky chai

సీనియర్అగ్ర హీరో విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి ‘జై లవ కుశ’ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నారని తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఆగష్టు 8 నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఖరారు అయినట్లు సమాచారం. మొదట ఈ చిత్రం కోసం దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకుందామనుకున్నారట కాని ఆయనే వేరే చిత్రాల తో బిజీ గా ఉండడంతో ఆయన స్థానంలో తమన్ ను తీసుకున్నారని సమాచారం.

ఈ చిత్రంలో చైతు కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోగా వెంకీ కి జోడిగా హ్యూమా ఖురేషి లేదా శ్రీయ లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రాన్ని కోన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు