50 ఏళ్ల సినీ ప్రస్థానం: హైదరాబాద్‌లో కోటి లైవ్ కాన్సర్ట్ పోస్టర్ ఆవిష్కరణ

50 ఏళ్ల సినీ ప్రస్థానం: హైదరాబాద్‌లో కోటి లైవ్ కాన్సర్ట్ పోస్టర్ ఆవిష్కరణ

Published on Sep 22, 2026 10:00 AM IST

సంగీత దర్శకుడు కోటి సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో భారీ లైవ్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ‘మనతో ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 28న ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కోటి అందించిన ఎన్నో పాటలు చిత్రాల విజయాల్లో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుత తరం ప్రేక్షకులకు ఆయన సంగీత ప్రస్థానం మరింత చేరువవుతుందని పేర్కొన్నారు.

​అనంతరం సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ, శ్రోతల ఆదరణ వల్లే సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా కొనసాగగలిగానని చెప్పారు. రాజ్–కోటి ద్వయంగా, ఆ తర్వాత స్వతంత్ర సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమలోని అగ్ర కథానాయకులందరి సినిమాలకూ పనిచేశానని గుర్తుచేసుకున్నారు. నవంబర్ 28న జరిగే కాన్సర్ట్‌లో సినీ అభిమానులను అలరించిన పాటలను ప్రత్యక్షంగా ఆలపించనున్నట్లు వెల్లడిస్తూ, చిత్ర పరిశ్రమ వర్గాలు సహకరించి ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు