విలన్ అవతారం ఎత్తిన మ్యూజిక్ డైరెక్టర్

విలన్ అవతారం ఎత్తిన మ్యూజిక్ డైరెక్టర్

Published on Jul 4, 2019 3:48 PM IST

రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పలాస 1978”. 70 దశకంలో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాతంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా రియలిస్టిక్ క్రైమ్ డ్రామా గా ఈ మూవీ తెరకెక్కుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఐతే యాంకర్ గా,సింగర్ గా,మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన రఘు కుంచె ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు.అది కూడా 30-40-50-70 ఏళ్ల ఏజ్ గ్రూప్ లలో కనిపించే వ్యక్తిగా రఘు పాత్ర ఉంటుందట. ఈ పాత్ర కథలో కీలకమవడంతో పాటు, బాగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని సమాచారం.గతంలో రఘు కుంచె కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశారు, కానీ పూర్తి స్థాయి పాత్రలో కనిపించడం మాత్రం ఇదే ప్రధమం. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సీనియర్ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా,రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు