“సాహో”ని అందుకే వదిలేశాం అంటున్న మ్యూజిక్ డైరెక్టర్

Published on May 28, 2019 3:56 pm IST

“సాహో” మూవీ మ్యూజిక్ అందించే బాధ్యతలనుండి మేము తప్పుకుంటున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగీత దర్శకులు శంకర్,ఎహ్సాన్, లాయ్ లు, నేడు ఆ నిర్ణయం వెనుక కారణాలు తెలియజేశారు. ఆ ముగ్గురిలో ఒకరైన శంకర్ మీడియా తో మాట్లాడుతూ “సాహో” చిత్ర యూనిట్ ఈ మూవీకి మల్టీపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాటలు కంపోజ్ చేయించాలని భావిస్తున్నారు. మేము ఈ మూవీ పాటలు స్వరపరిచే పనిలో ఉండగా మాకు ఈ విషం తెలిసింది.

ఒక సినిమాకు పలువురు సంగీత దర్శకులు పనిచేసే సంప్రదాయాన్ని నేను వ్యతిరేకించను కానీ, మాకు ఈ పద్దతి అనేది సౌకర్యవంతంగా అనిపించదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే వాళ్లతో చేయిస్తున్నారు కదా, పాటల వరకు మాకు ఇవ్వండి అని అడిగాము, దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించలేదు అందుకే ప్రాజెక్ట్ నుండి బయటకు రావడం జరిగింది, అని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More