అందరి చూపు అతని మీదే ఉంది

అందరి చూపు అతని మీదే ఉంది

Published on Dec 13, 2019 3:43 PM IST

Thaman

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చాలా బిజీగా ఉన్నారు. బిజీ అంటే మామూలు బిజీ కాదు… అసలు గ్యాపే దొరకనంత బిజీ. ఎప్పుడైతే ఆయన రొటీన్ పంథా వదిలి ‘తొలిప్రేమ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారో అప్పటి నుండి నిర్మాతల చూపు ఆయన మీదే పడింది. ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం నుండి ‘సామజవరగమన’ పాట బయటికొచ్చిందో అప్పటి నుండి నిర్మాతలు థమన్ మీద గట్టిగా ఫోకస్ పెట్టారు.

కొత్తదనం కావాలంటే థమన్ దగ్గరికి వెళ్లాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో పాటు ‘డిస్కో రాజా, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ’ లాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆయన చేతిలో ‘సోలో బ్రతుకే సో బెటర్, టక్ జగదీష్, మిస్ ఇండియా’ లాంటి సినిమాలతో పాటు త్వరలో పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేయనున్న ‘పింక్’ తెలుగు రీమేక్ కూడా అయన చేతిలోకే వచ్చిందా. ఇలా ఒక్కసారే పవన్ సినిమా రావడంతో థమన్ రేంజ్ ఒక్కసారే పెరిగిపోయింది. అంతా ప్రస్తుతం థమన్ మ్యానియానే నడుస్తుందని అనుకుంటున్నారు. పైగా థమన్ కూడా చేతిలో ఉన్న ప్రతి సినిమాకు భిన్నమైన సంగీతం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకొన్ని పెద్ద సినిమాలు కూడా ఆయన దగ్గరకే వెళ్లే అవకాశం ఉంది.

తాజా వార్తలు