చెన్నైలో గబ్బర్ సింగ్ 2 మ్యూజిక్ సిట్టింగ్స్

చెన్నైలో గబ్బర్ సింగ్ 2 మ్యూజిక్ సిట్టింగ్స్

Published on May 15, 2015 5:50 PM IST

DSP
పవన్ కళ్యాణ్ నటించనున్న గబ్బర్ సింగ్ 2 సినిమా ఈ నెల 29న ఘనంగా ప్రారంభంకానుంది ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశలో వున్నాయి. వచ్చే నెలనుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ ప్రాజెక్ట్ కి యువ దర్శకుడు కె.ఎస్ రవీంద్ర దర్శకత్వం వహించనున్నాడు. శరత్ మరార్ చిత్ర నిర్మాత. అనీషా ఆంబ్రోస్ హీరోయిన్.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానిక సంభందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ దేవితో కలిసి దర్శకుడు చెన్నైలో పాల్గుంటున్నాడు. ఈ చిత్రానికి సైతం దేవి శ్రీ ప్రసాద్ తనలోని బెస్ట్ ని అందించాలని ఉవ్విల్లురుతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మ్యూజికల్ హిట్స్ నిలిచాయి.

తాజా వార్తలు