‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?

Published on May 30, 2024 6:30 PM IST

టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ దక్కుతుందని ఇప్పటికే పలు సినిమాలు నిరూపించాయి. ఈ బాటలోనే కంటెంట్‌ను నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే సినిమా. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సాధించిన అజయ్ ఘోష్ ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై సినీ సర్కిల్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌పై చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ ఇచ్చింది.

ఈ చిత్ర ట్రైలర్‌ను మే 31న ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమాలోని కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలోని భాగోద్వేగాలు ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాయని వారు చెబుతున్నారు. ఈ మూవీ ట్రైలర్ కట్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రంలో యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. సీనియర్ నటి ఆమని, అమిత్ శర్మ, భానుచందర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, పవన్ సంగీతం అందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు