‘పుష్ప’తో రష్మిక ఆశ్చర్య పరుస్తుందట !

Published on Jun 17, 2021 11:24 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, పుష్పలో తన పాత్ర గురించి రష్మిక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన పాత్ర తన అభిమానులను ఆశ్చర్య పరుస్తుందని, ఈ పాత్రలో నటనకు చాలా అవకాశాలు ఉన్నాయి అని, కచ్చితంగా నాకు మంచి పేరు వస్తోందని, అలాగే తానూ రెండో భాగంలో కూడా కనిపిస్తాను అంటూ రష్మిక క్లారిటీ ఇచ్చింది.

ఇక అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది ‘రష్మిక మండన్నా’. లక్కీ లేడీగా ముద్ర వేసుకున్న రష్మిక భారీ ఆఫర్స్ దక్కించుకోవడంతో పాటు వరుస విజయాలు అందుకుంటుంది. అందుకే ‘పుష్ప’ సినిమాలో ‘రష్మిక మండన్నా’ది ఎలాంటి క్యారెక్టర్ ? ఆమె ఎలా కనిపించబోతుంది ? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి వారికీ క్లారిటీ ఇచ్చింది రష్మిక. ఇక ఈ సినిమాలో రష్మికది డీగ్లామర్ రోల్. ఆమె పాత్ర పల్లెటూరి పాత్ర.

సంబంధిత సమాచారం :