100 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “మై డియర్ దొంగ”

100 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “మై డియర్ దొంగ”

Published on May 18, 2024 8:06 PM IST

కమెడియన్ అభినవ్ గోమఠం మరియు కేబుల్ రెడ్డి నటి షాలిని కొండేపూడి ప్రధాన జంటగా నటించిన లేటెస్ట్ వెబ్ ఫిల్మ్ మై డియర్ దొంగ డైరెక్ట్ డిజిటల్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫారం అయిన ఆహా వీడియో లో సినిమా డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలతో మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ కామెడీ ఎంటర్టైనర్, ప్రస్తుతం 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకు పోతుంది.

BS సర్వజ్ఞ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి మరియు చంద్ర వెంపటి లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల మరియు సాయి శశాంక్ మండూరి కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు