ఆకట్టుకుంటున్న “మై డియర్ దొంగ” టీజర్!

ఆకట్టుకుంటున్న “మై డియర్ దొంగ” టీజర్!

Published on Mar 4, 2024 6:01 PM IST

కమెడియన్ అభినవ్ గోమఠం మరియు కేబుల్ రెడ్డి నటి షాలిని కొండేపూడి ప్రధాన జంటగా నటించిన లేటెస్ట్ వెబ్ ఫిల్మ్ మై డియర్ దొంగ. ఆహా వీడియో లో సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక యువతి మరియు దొంగల మధ్య ఊహించని ఎన్‌కౌంటర్‌ను టీజర్ చూపించడం జరిగింది.

టీజర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. BS సర్వజ్ఞ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి మరియు చంద్ర వెంపటి లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల మరియు సాయి శశాంక్ మండూరి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆహా వీడియో ఈ సినిమా ప్రీమియర్ తేదీ ప్రకటన పై త్వరలో క్లారిటీ ఇవ్వనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు