సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెటా’. ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా తాజాగా త్రిష రజనీకాంత్ తో ఉన్న తన పోస్టర్ ను ట్వీటర్ లో పోస్ట్ చేస్తూ.. ‘నా డ్రీమ్ నిజమవుతుంది. నిజమైన సూపర్ స్టార్ పక్కన నటించడం చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది.’ అని పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. అయితే ఈ పోస్టర్ లో త్రిష చాలా ట్రేడిషనల్ గా కనిపిస్తూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.
My dream come true to be pairing with the one and only SUPERSTAR ??
It is with pride and happiness I present…#Petta #Saro #Thalaivar? pic.twitter.com/ZIrm9foTkw— Trish Krish (@trishtrashers) December 9, 2018
