‘మై నేమ్ ఈజ్ ఆర్జీవీ’.. త్వరలో షూటింగ్ ప్రారంభం !

‘మై నేమ్ ఈజ్ ఆర్జీవీ’.. త్వరలో షూటింగ్ ప్రారంభం !

Published on Jan 15, 2019 5:50 PM IST

గోపి జాన్వి దర్శకత్వంలో సాయి వసంత్ క్రియేషన్స్ బ్యానర్ పై నూతన నటీనటులను వెండి తెరకు పరిచయం చేస్తూ ఆర్.కె మరియు వై.వి వెంకట రామలు నిర్మాతలుగా తెరకేక్కేందుకు సిద్దమవుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ ఆర్జీవీ’. ఈ సినిమా టీం స్క్రిప్ట్ వర్క్ పనులు అన్ని ముగించుకొని, ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ షూటింగ్ జరుపుకునేందుకు సిద్దమవుతుంది.

ఇక హీరో హీరోయిన్ లు మాత్రమే కొత్తవాళ్ళు కాగా, మిగతా తారాగణం మొత్తం మనకు తెలిసిన వాళ్ళే నటించనున్నారని చిత్రబృందం చెబుతుంది. ఈ సినిమాకు కెమెరా నరేంద్ర గౌడ్, సంగీతం : కిషోర్ కుమార్ శెట్టి, ఎడిటర్ : ఉదయ్, కో ప్రొడ్యూసర్ జి.పి రాజు, కథ మాటలు స్క్రీన్ ప్లే రాధాకృష్ణ దాసరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు