మా ఆవిడ ఫోన్ చేసి ‘ఫ్యామిలీ స్టార్’ రిజల్ట్ చెప్పేసింది – దిల్ రాజు

మా ఆవిడ ఫోన్ చేసి ‘ఫ్యామిలీ స్టార్’ రిజల్ట్ చెప్పేసింది – దిల్ రాజు

Published on Apr 4, 2024 1:02 AM IST

యువ నటుడు విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 2న గ్రాండ్ గా తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని పరశురామ్ పెట్ల తెరకెక్కించగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఫ్యామిలీ స్టార్ తప్పకుండా సక్సెస్ అవుతుందని మొదటి నుండి మేకర్స్ ఆశాభవం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ, తాజాగా ఫ్యామిలీ స్టార్ చూసిన మా ఆవిడ వెంటనే నాకు ఫోన్ చేసి హిట్ కొట్టేశారండి అని చెప్పిందని అన్నారు. మేము అనుకున్న విధంగా ఆడియన్స్ కి కూడా మూవీ ఖచ్చితంగా అందరికీ రీచ్ అవుతుందనే నమ్మకం ఆయన వ్యక్తం చేసారు. గోవర్ధన్ పాత్రలో విజయ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేయగా పరశురామ్ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా చక్కగా తెరకెక్కించారని అన్నారు దిల్ రాజు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు