డిసెంబర్ 12న థియేటర్లలోకి సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్’ – గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్

డిసెంబర్ 12న థియేటర్లలోకి సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్’ – గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్

Published on Dec 9, 2025 9:00 PM IST

Brahmanandam

అశ్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘మిస్టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేసి, సినిమా ఫస్ట్ టికెట్‌ను లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను నటించకపోయినా, దర్శకుడు మహి కోసమే ఇక్కడికి వచ్చాను. నా తొలి సినిమా ‘శ్రీ తాతావతరం’ (1985) నుంచి మహి నాకు మంచి మిత్రుడు. ఈ చిత్రంలో చివరి 20 నిమిషాల సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, టైటిల్ కూడా చాలా బాగుంది’’ అని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత జయ్ ఈ చిత్రాన్ని నిర్మించారని దర్శకుడు మహి కోమటిరెడ్డి పేర్కొన్నారు. సరికొత్త స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్లలో విడుదల కానుంది. రోహిత్, మేఘన రాజపుట్ జంటగా నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది. అభిద్ భూషణ్, రియా కపూర్, కన్నడ నటుడు బాలరాజ్ వాడి ఇందులో కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు