స్టార్ హీరోల భారీ చిత్రాలతో దూసుకెళ్తున్న బడా నిర్మాణ సంస్థ!

స్టార్ హీరోల భారీ చిత్రాలతో దూసుకెళ్తున్న బడా నిర్మాణ సంస్థ!

Published on Mar 25, 2024 8:54 PM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వరుస పాన్ ఇండియా చిత్రాలను నిర్మిస్తోంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొద్ది కాలం లోనే బడా చిత్రాల నిర్మాణం తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న పుష్ప 2 ది రూల్(Pushpa 2 the rule) చిత్రాలను నిర్మిస్తోంది. పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ 15, 2024 న రిలీజ్ కానుంది. అదే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది థియేటర్ల లోకి రానుంది.

వీటితో పాటుగా రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం లో తెరకెక్కుతున్న RC16 చిత్రానికి సమర్పకులు గా వ్యవహరిస్తూ, సుకుమార్ దర్శకత్వంలో, రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న RC17 చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాలు వచ్చే ఏడాది థియేటర్ల లోకి రానున్నాయి. మరొక పక్క ప్రభాస్ (prabhas), హను రాఘవపూడి ల చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉండగా, ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ ల చిత్రం కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. వీటిని కూడా ఈ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ స్టార్ హీరోల బడా చిత్రాలతో పాటుగా, మరికొన్ని చిత్రాలను నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు