బ్రేకీవెన్ కి దగ్గరగా “నా సామిరంగ”..3 రోజుల సాలిడ్ వసూళ్లు.!

బ్రేకీవెన్ కి దగ్గరగా “నా సామిరంగ”..3 రోజుల సాలిడ్ వసూళ్లు.!

Published on Jan 17, 2024 9:52 AM IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “నా సామిరంగ”. మరి డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం నాగ్ కెరీర్ లో మరో సంక్రాంతి హిట్ గా నిలవగా ఈ చిత్రం అయితే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బ్రేకీవెన్ దిశగా దూసుకెళ్తుంది. ఇక మూడవ రోజు రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో వసూళ్లు పి ఆర్ నంబర్స్ ప్రకారం ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి.

నైజాం – 1.05 కోట్లు
సీడెడ్ – 60 లక్షలు
వైజాగ్ – 51 లక్షలు
తూర్పు గోదావరి – 44 లక్షలు
వెస్ట్ గోదావరి – 22 లక్షలు
కృష్ణ – 24 లక్షలు
గుంటూరు – 34 లక్షలు
నెల్లూరు – 18 లక్షలు

మొత్తం – 3.58 కోట్లు షేర్ ని నా సామిరంగ మూడో రోజు అందుకోగా ఈ మొత్తం మూడు రోజుల్లో ఈ చిత్రం 12.46 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ అయితే మొత్తం 24.8 కోట్ల గ్రాస్ అందుకొని సాలిడ్ రన్ తో అప్పుడే బ్రేకీవెన్ దిశగా వెళ్తుంది అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు