టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా అల్లరి నరేష్ అలాగే రాజ్ తరుణ్ లు ముఖ్య పాత్రల్లో దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “నా సామిరంగ”. మరి డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రంతో మరోసారి నాగార్జున పండుగ రేస్ లో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రం డే 1 నుంచి కూడా వసూళ్లు అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు 7 రోజుల రన్ ని అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ 7వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు వివరాలు ఏరియాల వారీగా చూసినట్టు అయితే పి ఆర్ నంబర్స్ ప్రకారం ఇలా ఉన్నాయి..
నైజాం – 21 లక్షలు
సీడెడ్ – 20 లక్షలు
వైజాగ్ -23 లక్షలు
తూర్పు – 16 లక్షలు
వెస్ట్ – 9 లక్షలు
కృష్ణ – 8 లక్షలు
గుంటూరు – 9 లక్షలు
నెల్లూరు – 5 లక్షలు
మొత్తం 7వ రోజు 1.11 కోటి షేర్ ని నా సామిరంగ తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. ఇక ఈ మొత్తం 7 రోజుల్లో 20.54 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ నుంచి ఈ చిత్రం అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా 41.3 కోట్ల గ్రాస్ ని రాబట్టి అదరగొట్టింది.


