దుమ్ము లేపుతున్న “నా సామిరంగ”..డే 2 తెలుగు స్టేట్స్ వసూళ్లు

దుమ్ము లేపుతున్న “నా సామిరంగ”..డే 2 తెలుగు స్టేట్స్ వసూళ్లు

Published on Jan 16, 2024 11:02 AM IST


అక్కినేని నాగార్జున హీరోగా ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా మరో యంగ్ హీరోస్ అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ లు కూడా ముఖ్య పాత్రల్లో నటించిన సాలిడ్ మాస్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా “నా సామిరంగ”. మరి నాగ్ కి కలిసొచ్చిన సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం కూడా మంచి విలేజ్ డ్రామాగా రాగా నాగ్ మరోసారి తన సత్తా చూపిస్తున్నాడు. మరి డే 1 కంటే ఎక్కువగా ఇప్పుడు డే 2 వసూళ్ళని అందుకుని దుమ్ము లేపుతున్నట్టుగా తెలుస్తుంది. మరి తెలుగు స్టేట్స్ లో రెండో రోజు వసూళ్లు ఏరియాల వారీగా చూసినట్టు అయితే..

నైజాం : 1.47 కోట్లు
సీడెడ్ : 76 లక్షలు
వైజాగ్ : 57 లక్షలు
తూర్పు గోదావరి : 54 లక్షలు
వెస్ట్ గోదావరి : 34 లక్షలు
కృష్ణ : 26 లక్షలు
గుంటూరు : 41 లక్షలు
నెల్లూరు : 20 లక్షలు

2వ రోజు ఏపీ&తెలంగాణ – 4.55 కోట్లు షేర్ ని నా సామిరంగ అందుకోగా మొత్తం రెండు రోజుల్లో అయితే 8.88 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో అందుకుంది. మొత్తానికి అయితే నాగ్ మాత్రం మళ్ళీ తన సంక్రాంతి బరిలో అదరగొడుతున్నదని చెప్పాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు