‘నా సామిరంగ’ : రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్

‘నా సామిరంగ’ : రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on Dec 9, 2023 8:30 AM IST

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నా సామిరంగ. ఈ మూవీకి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోని డిసెంబర్ 10న రిలీజ్ చేయనున్నారు.

విషయం ఏమిటంటే, నా సామిరంగ లో మొత్తంగా ఆరు సాంగ్స్ ఉండగా వాటిని కీరవాణి అద్భుతంగా కంపోజ్ చేసారని, చాలా ఏళ్ళ తరువాత నాగ్, కీరవాణి ల కాంబోలో రానున్న ఈ సాంగ్స్ అదిరిపోనున్నాయని అంటున్నారు. ఇక ఈ మూవీని రానున్న 2024 సంక్రాంతి బరిలో నిలపనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా దీనిని జనవరి 10 లేదా 11న రిలీజ్ చేసేందుకు వారు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్. ఇప్పటికే జనవరి 12న గుంటూరు కారం, హను మాన్, 13న ఈగిల్, సైంధవ్ మూవీస్ బరిలో ఉండగా, అన్నిటికంటే ముందే తమ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకురావాలనేది నా సామిరంగ మేకర్స్ ఆలోచనట. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పై పక్కాగా మేకర్స్ నుండి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు