నా సామిరంగ లేటెస్ట్ వసూళ్లు ఇవే!

నా సామిరంగ లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on Jan 16, 2024 5:07 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం రెండో రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం జరిగింది. మొత్తం గా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 17.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది.

ఈ చిత్రం లో అషికా రంగనాథ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు