బుల్లితెర పై “నా సామిరంగ” కి సూపర్ రెస్పాన్స్!

బుల్లితెర పై “నా సామిరంగ” కి సూపర్ రెస్పాన్స్!

Published on Apr 4, 2024 3:36 PM IST


టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ (Naa samiranga). ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారం అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం స్టార్ మా లో 8.08 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అషికా రంగనాథ్, శబీర్ కల్లారక్కల్ లు కీలక పాత్రల్లో నటించగా, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు